9.05.2011

సప్త సముద్రాలు -
కారం
క్షీరం
దధి (పెరుగు)
మధు (తేనె )
సుర (మద్యం )
ఇక్ష్హ్హు (చెరుకు రసం )
సుధోధకం(నీరు)


సప్త ఋషులు -
మరీచి
ఆత్రి
అంగీరసుడు
పౌలస్త్హ్యుడు
పులహ
క్రతు
వసిష్టుడు



పంచకన్యలు -
అహల్య
ద్రౌపది
సీత
తార
మండోదరి


నవవిధ భక్తి -
శ్రవణం
కీర్తనం
స్మరణం
పాదసేవనం
అర్చనం
వందనం
దాస్యం
సఖ్యం
ఆత్మ నివేదనం


అష్టకష్టాలు -
అప్పు
యాచన
జారత్వం (వ్యభిచారం )
ముసలితనం
రోగం
దారిద్యం
చొరత్వం
ఉచ్చిష్ట భోజనం (ఎంగిలి మెతుకులు తినాల్సి రావడం )

7.13.2009

సుమతీ పద్యము

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ .

తాత్పర్యము --
ఎవ్వరు చెప్పినను వినవచ్చును .వినగానే తొందర పడక నిజమో అబద్ధమో వివరించి తెలుసుకోనిన వాడే న్యాయము తెలిసిన వాడు .

సుమతీ పద్యము

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు , జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ .

తాత్పర్యము --
తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వలన వచ్చు సంతోషము కలగదు , ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును .

సుమతీ పద్యము

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నుక సేయువాడు నేర్పరి సుమతీ .

తాత్పర్యము ---
మేలు చేసినవారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు . కీడు చేసిన వానికి , తప్పు తలంపక మేలు చేయువాడే నేర్పరితనము కలవాడు .

సుమతీ పద్యము

అల్లుని మంచితనంబును ,
గొల్లని సాహిత్య విద్య , కోమలి నిజమున్ ,
బొల్లున దంచిన బియ్యము ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ .

తాత్పర్యము ---
అల్లుడు మంచిగా నుండుట , గొల్లడు విద్వాంసుడౌట , ఆడుది నిజాము చెప్పుట , పొల్లున దంచిన బియ్యము , తెల్లని కాకులును లోకములో లేవని తెలియ వలయును .

సుమతీ పద్యము

అధరము కదిలియుగధలక
మధురములగు భాషలుడిగి ,
నధికార రోగపూరిత
బధిరాంధక సవముజూడ బాపుము సుమతీ .

తాత్పర్యము --
పెదవి కదిలేనో లెధో తెలియని విధమున , మంచి మాటలను మాని , అధికారమనేడి రోగముచే పలుకకుండుటేయే నియమముగా కల్గినటు వంటి అధికారి - కన్నుల చూడక , చెవుల వినక , పెదవి కదల్చక యుండు పీనుగుతో సమానమే అగుటచే అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును .

సర్వే కొలతలు

7 . 92 అంగుళములు (inches ) = 1 లింకు

100 లింకులు = 1 గొలుసు

10 గొలుసులు = 1 ఫర్లాంగు

8 ఫర్లాంగులు = 1 మైలు

సంఖ్యలు

బేసి సంఖ్యలు

1 , 3 , 5 , 7 , 9 .


సరి సంఖ్యలు

2 , 4 , 6 , 8 , 10 .

7.12.2009

తెలుగు నెలలు

సంవత్సరమునకు పన్నెండు నెలలు . వాటి పేర్లు ---

1 . చైత్రము

2 . వైశాకము

3 . జ్యేష్టము

4 . ఆషాడము

5 . శ్రావణము

6 . భాద్రపదము


7 . ఆశ్వయుజము


8 . కార్తీకము

9 . మార్గశిరము

10 . పుష్యము

11 . మాఘము

12 . ఫాల్గుణము

ఋతువులు

సంవత్సరమునకు ఋతువులు 6 .

1 . వసంత ఋతువు ( చైత్ర ,వైశాఖ మాసములు ),

చెట్లు చిగురించి పూవులు పూయును .

2 . గ్రీష్మరుతువు ( జ్యేష్ట , ఆషాడ మాసములు ),

ఎండలు మెండుగా ఉండును .

3 . వర్ష ఋతువు ( శ్రావణ, భాద్రపద మాసములు ),

వర్షములు విశేషముగా కురుయును .

4 . శరద్రుతువు ( ఆశ్వియుజ , కార్తీక మాసములు ),

మంచి వెన్నెల కాయును .

5 . హేమంత ఋతువు (మార్గశిర , పుష్య మాసములు ) ,

మంచు కురుయును , చలి ఎక్కువ .

6 . శిశిర ఋతువు ( మాఘ , ఫాల్గుణ మాసములు ),

చెట్లు ఆకులు రాల్చును .

హిందూ సంఖ్యా మానము (అర్భుధము )

ఒకటి
ఒకటి పక్కన సున్నపెడితే పది
విధముగా ఒక్కొక్క సున్నా పెరిగే కొలది విలువ పెరుగుతుంది.
ఇలా తెలుగు సంఖ్యా మానము లో 36 స్థానములు ఉన్నవి .
ఇవి అన్ని కలిపి అర్భుదము అని అంటారు ,
ఒక్కో స్థానానికి ఒక్కో పేరు ఉంది . అవి ---
ఒకట్లు
పదులు --( 1 సున్న )
వందలు ---( 2 సున్నలు)
వేలు --- ( 3 సున్నలు)
పదివేలు ----- ( 4 సున్నలు)
లక్ష --- ( 5 సున్నలు )
పదిలక్షలు -- -- ( 6 సున్నలు )
కోటి ------ ( 7 సున్నలు )
దశకోటి --- ( 8 సున్నలు)
శతకోటి ---- ( 9 సున్నలు )
సహస్రకోటి --- ( 10 సున్నలు )
న్యర్భుధము ----- ( 11 సున్నలు )
ఖర్వము -----( 12 సున్నలు )
మహాఖర్వము --- ( 13 సున్నలు )
పద్మము -- --- ( 14 సున్నలు )
మహాపద్మము --- ( 15 సున్నలు )
క్షోణి --- ( 16 సున్నలు )
మహాక్షో ణి -----( 17 సున్నలు )
శంఖము ---- (18 సున్నలు )
మహా శంఖము --- ( 19 సున్నలు )
క్షితి -----( 20 సున్నలు )
మహా క్షితి ------ ( 21 సున్నలు )
క్షో భము ----( 22 సున్నలు )
మహా క్షోభము ----( 23 సున్నలు)
నిధి------- ( 24 సున్నలు )
మహానిధి ---- ( 25 సున్నలు )
పరతము -----( 26 సున్నలు )
పరార్ధము -----( 27 సున్నలు )
అనంతము - ---- ( 28 సున్నలు )
సాగరము ---- ( 29 సున్నలు )
అవ్యయము ---- ( 30 సున్నలు )
అమృతము ---- ( 31 సున్న్నలు )
అచింత్యము -----( 32 సున్నలు )
అమేయము ----- ( 33 సున్నలు )
భూరి --------- ( 34 సున్నలు )
మహాభూరి ----- ( 35 సున్నలు )

తెలుగు సంవత్సరములు

తెలుగు సంవత్సరములు 60 .
ఈ సంవత్సరములు గడిచిన తరువాత మరల అవియే వచ్చును.

1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. ఆంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్
22.సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మధ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విలంభి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వా వసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధి కృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. సల
51. పింగళ
52. కాళయుక్తి
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుదుంభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ

7.04.2009

కాలములు

2 మాసములు1 ఋతువు ,

6 ఋతువులు 1 సంవత్సరము ,

సంవత్సరమునకు ఆయనములు 2 ,

కాలములు 3 ---- వేసవికాలము, వర్షాకాలము ,శీతాకాలము.

1 . వేసవి కాలం ----చైత్రము,వైశాఖము ,జ్యేష్టము ,ఆషాడము .

2 . వర్షాకాలము --- శ్రావణము ,భాద్రపదము ,ఆశ్వియుజము, కార్తీకము .

3 . శీతా కాలము -- --- మార్గశిరము ,పుష్యము , మాఘము ,ఫాల్గుణము .

యుగములు

1 .కృతయుగము - --17,28 ,000 సంవత్సరములు

2 .త్రేతా యుగము ---- 12,96,000 సంవత్సరములు

3 .ద్వాపరయుగము ---- 8 ,64,000 సంవత్సరములు

4 .కలి యుగము----- 4,32,000సంవత్సరములు

తొలి ఏకాదశి

ఏడాది పొడుగునా 24 ఏకాదశి లు ఉండగా ,

ఆషాడ శుద్ధ ఏకాదశి ని తొలి ఏకాదశిగా పాటిస్తారు.

ఏకాదశి తిది కి ఉపవాస నియమము ప్రధానం .

తొలి ఏకాదశి ని శయనఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ రోజు నుంచి విష్ణువు క్షీర సాగరం లో శేష పాన్పుఫై శేయనిస్తాడని పురాణాలు చెపుతున్నాయి .

ఈ రోజు నుండి కొత్త సంవత్సరం గా పరిగణించే వారు .

ఇప్పటి నుండి పండుగలు మొదలు అవుతాయి.

ఈ రోజు కుడుములు వండి వినాయకుడికి నివేద్యం పెడితే మంచిది.

6.26.2009

సంఖ్యా భోధనలు

త్రికరణములు ------ సత్వ గుణము ,రజో గుణము ,తమోగుణము .

త్రికర్ణములు --- మనస్సు , వాక్కు , క్రియ.

త్రికాలములు ---భూత కాలము , భవిష్యత్ కాలము ,వర్తమాన కాలము.

త్రిలోకములు -- పాతాళలోకము ,మనుష్య లోకము ,స్వర్గ లోకము .

త్రిమూర్తులు --- బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు .

త్రిమతాచార్యులు ---శంకర , రామానుజ ,మద్వాచార్యులు .

కవి త్రయము --నన్నయ , తిక్కన , ఎర్రాప్రగడ .

చతుర్వేదములు -- ఋగ్వేదము , యజుర్వేదము ,సామవేదము ,అధర్వణ వేదము .

వయోవస్థలు --- బాల్యము , యౌవనము ,కౌమారము ,వార్ధక్యము .

పురుషార్ధములు -- ధర్మము , అర్దము , కామము ,మోక్షము .

పంచ పితరులు - -- కన్నతండ్రి ,వడుగు చేసినవాడు ,చదువు చెప్పినవాడు, ఆపదనుండి కాపాడినవాడు, దేశమును పాలించువాడు.

పంచ మాత్రుమూర్తులు --- కన్నతల్లి , పెంచిన తల్లి , గురువుగారి భార్య ,అన్నభార్య, భార్యను కన్న తల్లి.

పంచాంగములు ---- తిది , వారము , నక్షత్రము , యోగము , కరణము.

పంచామృతములు --- పాలు ,పెరుగు ,నెయ్యి , తేనె ,నీరు .

పంచమహాపాపములు ---- బంగారము దొంగిలించుట , సురాపానము , బ్రహ్మహత్య ,గురుపత్ని గమనము , మహాపాతక సహవాసము.

కర్మేంద్రియములు-----వాక్కు ,పాణి ,పాదము ,పాయువు, ఉపస్థలు .

పంచభూతములు ----భూమి , నీరు , అగ్ని , గాలి , ఆకాశము.

పంచగంగలు ---- గంగ , కృష్ణ ,గోదావరి , తుంగబద్ర , కావేరి .

పంచప్రాణములు ---- ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము , సమానము.

అరిషడ్వర్గము --- కామ , క్రోద , లోభ ,మోహ ,మధ , మాత్సర్యములు .

సప్తమహర్షులు --- గౌతముడు , విశ్వామిత్రుడు , భరద్వాజుడు , ఆత్రి , వసిష్టుడు , కశ్యపుడు , జమదగ్ని .

సప్తలోకములు (ఊర్ద్వ)---- భూలోకము ,భువర్లోకము ,సువర్లోకము ,మహార్లోకము ,జనోలోకము ,తపోలోకము , సత్యలోకము .

సప్తద్వీపములు --- జంభుద్వీపము , ప్లక్షద్వీపము , శ్యాకద్వీపము ,క్రౌంచద్వీపము, సాల్మ్యద్వీపము , పుష్కర ద్వీపము , యవద్వీపము .

సప్త లోకములు ( అధో ) --- అతలము ,వితలము , సుతలము ,రసాతలము ,తలాతలము , మహాతలము , పాతాళము .

సప్త వ్యసనములు - కల్లు తాగుట , జూదము , స్త్రీ వ్యామోహము , వేటాడుట ,కాటిన్యము వహించుట , దొంగతనము , పరనింద .

అష్ట కష్టములు --- దరిద్రము , దాస్యము , భార్యావియోగము , సర్వము తనే చేసుకొనుట , యాచన , ప్రయత్నవిపల్యము , వ్యాదిచే బాధపడుట

నవరసాలు -- శృంగారము , హాస్యము , కరుణ , వీరము , రౌద్రము , భయానకము ,భీబత్సము , అద్భుతము , శాంతము.

నవరత్నములు --- వజ్రము ,వైడూర్యము , గోమేధకము , పుష్యరాగము , మరకతము , మాణిక్యము , నీలము , ముత్యము ,పగడము .

నవధాన్యములు --- వడ్లు, ఉలవలు , పెసలు , మినుములు , నువ్వులు , గోధుమలు , అనుములు , కందులు ,శెనగలు .


అష్టాదాస పురాణములు -- భాగవతము , నారదీయము , మార్కందేయము ,
ఆగ్నేయము , బ్రహ్మ , పద్మము , వైష్ణవము , సైవము, భవిష్యతు , బ్రహ్మాండ , బ్రహ్మవయ్ వర్తకము , లింగము , వరాహము , స్కాందము ,కూర్మము , వామనము , మత్స్యము , గారుడము .

6.25.2009

సామెతలు

ఆది లోనే హంస పాదు .

అతిరహస్యము బట్టబయలు .

అబ్యాసము కూసు విద్య .

ఇంటిలో ఈగలమోత బయట పల్లకీల మోత .

ఇంటగెలిచి రచ్చ గెలువు .

ఇంటి దొంగని ఈస్వరుడైన పట్టలేడు .

ఉట్టికి ఎగరలేనమ్మ ,స్వర్గానికి ఎగిరింధంట .

చంద్రునికి ఒక నూలి పోగు.

ఏ ఎండకు ఆ గొడుగు .

వజ్రము ను వజ్రము తోనే కోయవలెను .

పెద్దలమాట పెరుగన్నపు మూట .

ఒక వరలోరెండు కత్తులు ఇమడవు .

కంచు మోగునట్లు కనకంబు మోగునా .

కలిమి లేములు కావడి కుండలు .

కాకి పిల్లకాకి కి ముద్దు .

పండ్ల చెట్టు కే రాళ్ళ దెబ్బలు .

కుక్క కాటుకి చెప్పు దెబ్బ .

కోటి విద్యలు కూటి కొరకే .

గతి లేని అమ్మకు గెంజే పానకము .

రాజుల సొమ్ము రాళ్ళపాలు .

గ్రుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్టు .

గుర్రము గుడ్డిది అయినా దాణా తప్పదు .

గోరు చుట్టు మీద రోకలి పోటు .

చదివిన వాడికన్నా చాకలి వాడు మేలు .

మొక్కెయ్యి వంగనిది మానయివంగదు .

చెరపకురా చెడేవు .

తాతకు దగ్గులు నేర్పుటయా.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు .

దాసుని తప్పులు దండము తోసరి .

దిక్కులేని వారికి దేవుడే దిక్కు .

దూరపు కొండలు నునుపు .

నవ్వు నాలుగువిదాలు చేటు .

పిట్ట కొంచము కూత గనము.

చెప్పే వారికి వినేవారు లోకువ .

పెదవి దాటిన పృధివి దాటును.

పోరునష్టము పొందు లాభము .

బూడిదలో పోసిన పన్నీరు .

మెరిసేదంతా బంగారము కాదు .

రొట్టెవిరిగి నేతిలో పడినట్టు.

రౌతు కొద్ది గుర్రము ,పిండి కొద్ది రొట్టె .

నిజాము దేవుడెరుగు ,నీరు పల్లమెరుగు .

అప్పు చేసి పప్పు కూడు .

శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు .

రౌతు మెత్తనైతే గుర్రము మూడు కాళ్ళు మీద నడుచును.

మేకవన్నె పులి .

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు .

గోరంత దీపం కొండంత వెలుగు .

అబ్బలేని బిడ్డ మబ్బులేని ఎండ .

వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు.

చెప్పులోరాయి చెవిలో జోరీగానట్లు .

గోడకు చేవులుండును.

ఎంత చెట్టుకు అంత గాలి .

లోక స్వభావము

ఆరు నెలలు సహవాసం తో వాడువీడవును .
పాముకి విషము తలనుండును ,మనిషికి నిలువెల్ల విషమే .
గాడిదకు గంధపు చెక్కలు వాసన తెలియదు .
ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలెను .
వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టెను .
బంగారు పల్లెమునకైనా గోడదాపు అవసరము .
ఎంతటి వారయినా, లోకమునకు లోంగావలయును .
దుర్జనులు మంచివారితో కలహముకోరెదరు .
చిమ్మటలు భద్రపరిచిన పట్టుబట్టలను కొరికి వేయును .
క్రొత్త వింత, పాత రోత .
నిండు కుండ తొణకదు .
లేగలకు చేపనిదే ఆవులు పాలీయవు .
మంచి వారికి మంచి, చెడ్డవారికి చెడు జరుగును .
దేవుడు ఏమి చేసినను అది మన మేలు కొరకే .
ఎంత చెట్టుకు అంత గాలి .
చిన్ననాటి అలవాట్లు చిరకాలము ఉండును .
మన మంచి పనులే మనకు ధనము .
ఎవరు చేసిన పాపమూ వారిని వేటడుచుండును.
కొలిచినచో ఇలవేల్పు వరములిచ్చును .

మంచి అలవాట్లు

దేవుని సదా ద్యానించుము .
శరణన్న వారిని క్షమించుము .
కన్నతల్లిని మరువరాదు .
ఆకలన్న వారికి అన్నం పెట్టుము .
దేవుని దూషించరాదు .
బంధువులను తిట్టరాదు .
కుక్కను కాలితో తన్నరాదు .
అథిదులను అవమానించరాదు .
చీపురును కాలితో తోయరాదు.
గోళ్ళను సంధ్యవేళ తీయరాదు .
అద్దము మాటి మాటికి చూడరాదు .
పూలను కాలితో ముట్టరాదు .
దీపము వెలిగించిన తరువాత తల దువ్వరాదు .
మితిమీరి తినరాదు .
మాతృభూమిని మరువరాదు .
మాతృభాషను మరువరాదు .
గురువును తిట్టరాదు .
చేసిన మేలు మరువకుము
నీటిలో ఉమ్ము వేయరాదు .
పిల్లల దగ్గరకు ,దేవుని దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళరాదు .
పిలువని ప్యేరంటంనకు పోరాదు .
అన్ని వేళల నవ్వరాదు .
పెద్దలు వద్దన్నా పని చేయరాదు .
పరస్త్రీ వ్యామోహం పనికి రాదు .
నేల అదురు నట్టు నడువరాదు .
బ్రాహ్మణులను దూషించరాదు .
మాటి మాటి కి ఏడ్చే స్త్రీ ని నమ్మరాదు .
అలవి కాని చోట అధికులము అనరాదు .
కాళిగా కూర్చుని కాళ్ళు ఊపరాదు.
శుక్ర , శని వారము లందు సుద్దిగా నుండుము .
నడమంత్రపుసిరి కి గర్వపడకుము .
అన్నదమ్ములను పుట్టినింటి వారిని అగౌరవపరచవద్దు .
గంధము తీయు సానను ,గడపను కాలి తో తన్నరాదు .
గది మద్యలో కూర్చుని ఏడవరాదు .
బీదలను చూసి హేళన చేయవద్దు .
ధనికులను చూసి ఈర్ష్య పడవద్దు .

మాతృ వందనం

వందే మాతరం - వందే మాతరం
సుజలాం సుఫలాం - మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరాం
వందే మాతరం - వందే మాతరం
శుభ్ర జ్యోస్త్నా పులకిత యామినీం ,
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందే మాతరం - వందే మాతరం